Kalki 2898 AD: 'కల్కి 2898 ఏడీ' రిలీజ్ ట్రైలర్ పై రాజమౌళి స్పందన

Rajamouli opines on Kalki 2898 AD release trailer

  • ప్రభాస్ హీరోగా  కల్కి 2898 ఏడీ
  • నాగ్ అశ్విన్ దర్శకత్వంలో చిత్రం
  • ఈ చిత్రం నుంచి నిన్న రిలీజ్ ట్రైలర్ విడుదల

ప్రభాస్ ప్రధాన పాత్రలో, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న భారీ బడ్జెట్ చిత్రం కల్కి 2898 ఏడీ. జూన్ 27న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రం నుంచి నిన్న రిలీజ్ ట్రైలర్ విడుదలైంది. 

దీనిపై అగ్రశ్రేణి దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి స్పందించారు. ఇది పవర్ ప్యాక్డ్ ట్రైలర్ అని అభివర్ణించారు. ఈ ట్రైలర్ ను చూశాక... సినిమాను మొదటి రోజు మొదటి ఆటలోనే చూడాలన్నంత కోరిక కలుగుతోంది. ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్ గారు, డార్లింగ్ (ప్రభాస్), దీపిక పదుకొణేల క్యారెక్టర్లలో ఎంతో లోతు ఉన్నట్టు తెలుస్తోందని, నిజంగా అత్యంత ఆసక్తికరంగా అనిపిస్తోందని రాజమౌళి పేర్కొన్నారు. 

"ఈ చిత్రంలో కమల్ హాసన్ సర్ లుక్ నన్ను ఎంతగానో ఆకట్టుకుంది. ఆయన ఎప్పటికీ అమేజింగ్. నాగి (దర్శకుడు నాగ్ అశ్విన్)... ఈ నెల 27న నీ ప్రపంచంలో లీనమైపోయేందుకు ఆగలేకపోతున్నాం" అంటూ రాజమౌళి ట్వీట్ చేశారు.

  • Loading...

More Telugu News