బొగ్గు గనుల వేలానికి బీఆర్ఎస్ మద్దతు పలకలేదు!: వినోద్ కుమార్
- బొగ్గు గనుల వేలంపై కాంగ్రెస్ బిల్లు పెడితే... బీజేపీ ఆర్డినెన్స్ తెచ్చిందన్న వినోద్ కుమార్
- 2011లో బిల్లును ప్రవేశపెట్టినప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉందని వెల్లడి
- భట్టివిక్రమార్క వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలని హితవు
ఉపముఖ్యమంత్రి భట్టివిక్రమార్క వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు. సెక్షన్ 17 కింద యాక్షన్ లేకుండా బొగ్గు గనులు రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వొచ్చని స్పష్టం చేశారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టివిక్రమార్క కేంద్రం వద్దకు వెళ్లాలని... బొగ్గు గని వేలంను ఆపాలని హితవు పలికారు. బొగ్గు గనుల వేలానికి తాము మద్దతిచ్చామనే మాటలను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సింగరేణిని చంపేయడానికి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి సంబంధించిన 8 మంది ఎంపీలను గెలిపించారా? అని ప్రశ్నించారు.