కాంగ్రెస్ పాలన ఎంత హృదయవిదారకంగా ఉందో తెలుసుకోవాలంటే ఓ తండ్రి రాసిన ఈ లేఖ చదవాల్సిందే: ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
- తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ
- విమర్శల్లో పదును పెంచిన బీఆర్ఎస్
- కాంగ్రెస్ నాయకుల పిల్లలే విదేశాల్లో చదవాలా? అంటూ ప్రవీణ్ కుమార్ ఫైర్
కాగా, అమెరికాలో చదువుతున్న తన పిల్లలకు ప్రభుత్వం నుంచి అందుతున్న సాయం ఆగిపోయిందని, దాంతో తదుపరి సెమిస్టర్లకు ఫీజు కట్టలేక ఇబ్బందులు పడుతున్నామని, ఆ వ్యక్తి లేఖలో వాపోయారు. అధికారుల చుట్టూ తిరుగుతున్నా, సరైన స్పందన లేదని, ప్రస్తుతం తన పిల్లల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ లేఖపై ప్రవీణ్ కుమార్ స్పందిస్తూ... ప్రశ్నించే గొంతుకలకు ఈ పేద బిడ్డల గోస కనిపించదా? అని ప్రశ్నించారు. మీ కాంగ్రెస్ నాయకుల పిల్లలే విదేశాల్లో చదవాలా? మా పేదల పిల్లలు చదవొద్దా? అంటూ ప్రశ్నించారు.