పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతున్న శ్రీముఖి?
- బుల్లితెర టాప్ యాంకర్ గా కొనసాగుతున్న శ్రీముఖి
- మూడు పదులు దాటుతున్నా పెళ్లి చేసుకోని అందాల భామ
- శ్రీముఖి తల్లిదండ్రులు సంబంధాలు చూస్తున్నారన్న ముక్కు అవినాశ్
మరోవైపు శ్రీముఖి వయసు మూడు పదులు దాటిపోతోంది. ఆమె పెళ్లి ఎప్పుడా? అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఆమె పెళ్లిపై జబర్దస్త్ కమెడియన్ ముక్కు అవినాశ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ... శ్రీముఖి తల్లిదండ్రులు ఆమెకు సంబంధాలు చూస్తున్నారని తెలిపాడు. ఈ ఏడాది ఆమె పెళ్లి జరిగే అవకాశం ఉందని చెప్పాడు. శ్రీముఖికి నచ్చిన కుర్రాడు దొరికితే పెళ్లి అయిపోతుందని తెలిపాడు.