ఒకే బూత్ లో ఎదురెదురుగా జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి.. ఫ్యాక్షన్ సీన్
- పోలింగ్ బూత్ లో ఒకరినొకరు చూసుకుంటూ ఎదురెదురుగా నిలబడ్డ జేసీ, పెద్దారెడ్డి
- ఆందోళనకు గురైన పోలీసులు, ఓటర్లు
- వెళ్లిపోవాలని ఇద్దరికీ నచ్చజెప్పిన పోలీసులు
ఒకే పోలింగ్ బూత్ లో జేసీ ప్రభాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఎదురుపడ్డారు. ఈ సందర్భంగా ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటూ ఎదురెదురుగా నిలబడ్డారు. ఈ సన్నివేశం అక్కడున్న అందరిలో ఒక్కసారిగా టెన్షన్ ను పెంచింది. ఏం జరుగుతుందో అనే టెన్షన్ వాతావరణం నెలకొంది. పోలీసులు సైతం ఆందోళనకు గురయ్యారు.
ఇక్కడి నుంచి వెళ్లిపోండి సార్ అని ఇద్దరికీ నచ్చజెప్పే ప్రయత్నాన్ని పోలీసులు చేశారు. ముందు ఆయన్నే పంపాలని పెద్దారెడ్డి అన్నారు. అట్లా కాదు... ముందు పెద్దారెడ్డినే పంపించండి అని జేసీ చెప్పారు. దీంతో, ఉత్కంఠ పెరిగింది. దీన్ని చూస్తున్న వాళ్లకు ఒక ఫ్యాక్షన్ సీన్ చూస్తున్నట్టు అనిపించింది. పోలీసులు బతిమిలాడటంతో... కాసేపటి తర్వాత ఇద్దరు నేతలు ఎవరి దారిన వారు వెళ్లిపోయారు. దీంతో, అందరూ ఊపిరిపీల్చుకున్నారు.