పద్మవిభూషణ్ తీసుకోవడానికి ముందు చిరంజీవికి కోడలు ఉపాసన ఆసక్తికర ప్రశ్న... వీడియో ఇదిగో
- అవార్డు తీసుకోవడానికి ముందు డ్రెస్సింగ్ రూంలో మామయ్యకు ప్రశ్న సంధించిన కోడలు
- నాలో.. క్లీంకారలో కామన్ పాయింట్ ఏమిటి? అని చిరంజీవికి ప్రశ్న
- నీ ప్రతిరూపమంటూ చిరంజీవి సమాధానం
- కాదు... మా ఇద్దరి తాతయ్యలకు పద్మవిభూషణ్ వచ్చిందన్న ఉపాసన
ఈ వీడియో ప్రకారం... చిరంజీవి అవార్డును తీసుకోవడానికి ముందు డ్రెస్సింగ్ రూంలో ఉన్న సమయంలో ఉపాసన అక్కడకు వెళ్లారు. 'మామయ్యా... మిమ్మల్ని ఒకటి అడుగుతాను, నాలో... క్లీంకారలో ఉన్న కామన్ పాయింట్ ఏమిటి?' అని ఉపాసన అడిగారు. దానికి చిరంజీవి స్పందిస్తూ... నీకు ప్రతిరూపమంటూ సమాధానం ఇచ్చారు.
'కాదు, మామయ్యా... కామన్ పాయింట్ ఏమంటే మా ఇద్దరి తాతయ్యలకు పద్మవిభూషణ్ వచ్చింది' అని ఉపాసన సమాధానం చెబుతారు. దానికి చిరంజీవి స్పందిస్తూ... అవును... వీసీ రెడ్డి గారు, నేను... అవును అని నవ్వేశారు. ఈ వీడియోలో చిరంజీవి, ఉపాసనతో పాటు రామ్ చరణ్ తేజ కూడా ఉన్నారు.