బీజేపీలోకి పెద్దపల్లి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ?.. టికెట్ కేటాయించకపోవడమే కారణమా?
- గత ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచిన వెంకటేశ్ నేత
- ఇటీవల కాంగ్రెస్‌లో చేరినా టికెట్ కేటాయించని పార్టీ
- నామినేషన్ వేసేందుకు రెడీగా ఉండాలంటూ బీజేపీ నుంచి కబురు
- ఒకట్రెండు రోజుల్లో స్పష్టత ఇస్తానన్న వెంకటేశ్ నేత
మరోవైపు, బీజేపీ తరపున ఇక్కడి నుంచి గోమాసె శ్రీనివాస్ బరిలో ఉన్నారు. అయితే, కాంగ్రెస్ అభ్యర్థిని ఎదుర్కొనేందుకు శ్రీనివాస్‌కున్న బలం సరిపోదని భావిస్తున్న బీజేపీ బలమైన అభ్యర్థి కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో కేంద్రమంత్రి అమిత్ షా ఏర్పాటు చేసిన కమిటీలోని సభ్యులు వెంకటేశ్ నేత పేరును సూచించినట్టు తెలిసింది. దీంతో నామినేషన్‌కు రెడీగా ఉండాలని ఆయనకు పార్టీ నుంచి కబురు వెళ్లినట్టు తెలిసింది. బీజేపీలో చేరబోతున్నట్టు వస్తున్న వార్తలపై వెంకటేశ్ నేత స్పందిస్తూ ఒకట్రెండు రోజుల్లో దీనిపై స్పష్టత ఇస్తానని చెప్పారు.