నాగచైతన్యను ఎందుకు మోసం చేశావనే ప్రశ్నకు సమంత సమాధానం ఇదే
- నెటిజెన్ ప్రశ్నకు కూల్ గా సమాధానమిచ్చిన సమంత
- ఇలా ప్రశ్నించడం మీకు మంచిది కాకపోవచ్చని సమాధానం
- సమంతకు మద్దతుగా నిలుస్తున్న పలువురు నెటిజెన్లు
ఈ క్రమంలో తాజాగా ఓ నెటిజెన్ సమంతను తన ప్రశ్నతో ఇబ్బంది పెట్టాడు. అమాయకుడైన నాగచైతన్యను ఎందుకు మోసం చేశావని ఆమెను ప్రశ్నించాడు. ఈ ప్రశ్నకు సమంత కూడా చాలా కూల్ గా సమాధానమిచ్చింది. ఈ ప్రశ్న వేయడం మీకు మంచిది కాకపోవచ్చని ఆమె వ్యాఖ్యానించింది. ప్రశ్నించడానికి మీకు ఇంకా స్ట్రాంగ్ టెక్నిక్స్ కావాలని చెప్పింది. మీరు బాగుండాలని తాను కోరుకుంటున్నానని తెలిపింది. మరోవైపు పలువురు నెటిజెన్లు సమంతకు మద్దతుగా నిలుస్తున్నారు. సమంత వ్యక్తిగత జీవితం గురించి ఇలాంటి ప్రశ్నలు వేయడం సరికాదని కామెంట్ చేస్తున్నారు.