విజయ్ దేవరకొండ సినిమా నాశనం కావడానికి కారణం ఇదే: వేణు స్వామి
- ప్రేక్షకులను ఆకట్టుకోని విజయ్ తాజా చిత్రం 'ది ఫ్యామిలీ స్టార్'
- సినిమా ఫ్లాప్ కావడానికి నెగెటివ్ పబ్లిసిటీనే కారణమన్న వేణు స్వామి
- 'గుంటూరు కారం' సినిమా పోవడానికి కూడా ఇదే కారణమని వ్యాఖ్య
విజయ్ దేవరకొండ సినిమా ఒక బేకార్ సినిమా అని, దాన్ని చూడాల్సిన అవసరం లేదని నెగెటివ్ రివ్యూస్ వచ్చాయని వేణు స్వామి చెప్పారు. ఈ సినిమా నాశనం కావడానికి ఇదే కారణమని తెలిపారు. సోషల్ మీడియాలో సినిమా రిలీజ్ కావడానికి ముందు నుంచే నెగెటివ్ ప్రచారం జరిగిందని చెప్పారు. ఈ సినిమా విషయంలో విజయ్ కు పెద్ద నష్టమే జరిగిందని అన్నారు.