ప్రజాశాంతి పార్టీ తెలంగాణ అధ్యక్షుడిగా బాబూ మోహన్
- బాబూ మోహన్ ను తెలంగాణ అధ్యక్షుడిగా నియమించిన కేఏ పాల్
- చాలా మంది పార్టీలో చేరేందుకు వస్తున్నారన్న పాల్
- వరంగల్ నుంచి లోక్ సభకు పోటీ చేస్తున్న బాబూ మోహన్
తెలంగాణలో బీజేపీకి ఓటు బ్యాంకు లేదని... అందుకే కాంగ్రెస్ లో నలుగురు ఏక్ నాథ్ షిండేలను తయారు చేసిందని కేఏ పాల్ ఎద్దేవా చేశారు. వీరిలో రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఉన్నారని... మరో నేత కూడా షిండే అయ్యే అవకాశం ఉందని చెప్పారు. వందేళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ మంచి నీళ్లు కూడా ఇవ్వలేదని... విద్యుత్ కోతలు కూడా మొదలయ్యాయని విమర్శించారు.