రేవంత్ రెడ్డికి మెజారిటీ ఉంది... మేం ప్రభుత్వాన్ని కూల్చమని స్పష్టంగా చెప్పాం: బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్
- మేం ప్రభుత్వాన్ని పడగొడతామని వారికి వారే ఊహించుకుంటున్నారని వ్యాఖ్య
- దానం నాగేందర్ అనర్హత వేటు నుంచి తప్పించుకోలేరన్న వినోద్ కుమార్
- అనర్హతపై స్పీకర్ త్వరగా నిర్ణయం తీసుకోవాలని సూచన
సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని తాము కూల్చమని స్పష్టంగా చెప్పినప్పటికీ... వారికి వారే ఊహించుకుంటున్నారని విమర్శించారు. ఓ పార్టీ నుంచి గెలిచిన వారు మరో పార్టీలోకి వెళ్లవద్దని... అలాచేసిన వారిని ఉరితీయాలని గతంలో ఇదే రేవంత్ రెడ్డి పలుమార్లు చెప్పారని గుర్తు చేశారు. 'రేవంత్ రెడ్డి గారు, మీకు మంచిగానే ఉంది మెజార్టీ. అయిదేళ్లు పరిపాలన చేయండి. మీరు చూసుకోవాల్సింది ఏమంటే మీ పార్టీలో ఉన్నవాళ్లు వెళ్ళకుండా చూసుకోండి' అని సూచించారు. ఈ రోజు కేసీఆర్ ప్రభుత్వం లేకపోయేసరికి ప్రజలు ఎంతో బాధపడుతున్నారని.. ఇప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా వెళ్లడం ప్రజలు జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. ఎమ్మెల్యేలను చేర్చుకోవడం బీఆర్ఎస్ చేసింది కాబట్టి మేం కూడా చేస్తామంటే ఎలా? అని నిలదీశారు.
తాజాగా ప్రతిమ మల్టీప్లెక్స్‌లో డబ్బులు దొరికిన ఘటనపై వినోద్ కుమార్ స్పందించారు. అక్కడ దొరికిన డబ్బులకు వాళ్లే లెక్కలు చెప్పుకుంటారని స్పష్టం చేశారు. వారు తనకు బంధువులు అయినంత మాత్రాన తనపై నిరాధార ఆరోపణలు చేస్తారా? అని నిలదీశారు.