అల్లు అర్జున్ ను కలుసుకుని కన్నీళ్లను ఆపుకోలేకపోయిన వీరాభిమాని... వీడియో ఇదిగో!
- అల్లు అర్జున్ ను చూసి భావోద్వేగాలకు గురైన ఫ్యాన్
- ఆరాధ్య హీరోను చూసి ఆనందబాష్పాలు
- ఎంతో ఆప్యాయంగా మాట్లాడిన అల్లు అర్జున్
- సామాజిక మాధ్యమాల్లో వీడియో వైరల్
తన ఆరాధ్య హీరో ఎదురుగా నిలబడి, తనతో మాట్లాడుతుంటే ఆ అభిమానికి సంతోషంతో కన్నీళ్లు ఆగలేదు. అల్లు అర్జున్ సమక్షంలో తీవ్ర భావోద్వేగాలకు గురయ్యాడు. అల్లు అర్జున్ ఎంతో ఆదరాభిమానాలతో ఆ అభిమానిని అక్కున చేర్చుకున్నారు. అప్యాయంగా అతడితో మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.