నెలకు రూ.2.5 కోట్లు ఇస్తేనే బిడ్డను కంటానని భార్య వింత షరతు!
- ఉచితంగా పురిటి నొప్పులు భరించడం తనవల్ల కాదంటూ వాదన
- గర్భం దాల్చకముందే భర్తతో ఒప్పందం కుదిరిందంటూ వెల్లడి
- అలాగే పుట్టిన బిడ్డ అవసరాల కోసం నెలకు అదనంగా మరో రూ.2.50కోట్ల డిమాండ్
- దుబాయి మిలియనీర్ భార్య షరతుపై నెట్టింట చర్చ
అలాగే పుట్టిన బిడ్డ అవసరాల కోసం నెలకు అదనంగా మరో రూ.2.50 కోట్లు ఇవ్వాలని కోరింది. ఒకవేళ ఇద్దరు పిల్లలకు జన్మనివ్వాలంటే ఈ ధర రెట్టింపు అవుతుందని ఆమె తన భర్తకు షరతు పెట్టింది. అలాగే ఇంట్లో పనివాళ్ల సంఖ్యను రెట్టింపు చేయాలని, ప్రత్యేకంగా నైట్ నర్స్‌ను నియమించాలని తెలిపింది. బిడ్డ కారణంగా రాత్రుల్లో తన నిద్రకు భంగం కలగకుండా ఆ నర్సు పని చేస్తుందని పేర్కొంది. పైగా భర్త సంపాదనను ఖర్చు చేయడమంటే తనకు ఇష్టమని ఆమె చెప్పుకొచ్చారామె.