నోటీసులు నాకు కాదు... కోమటిరెడ్డికి పంపించాలి: కాంగ్రెస్ నేత మాణిక్కంకు కేటీఆర్ చురక
- పీసీసీ పదవి కోసం రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు ఠాగూర్‌కు ఇచ్చారన్న కేటీఆర్
- ఈ వ్యాఖ్యలు తాను అనలేదని... కోమటిరెడ్డే అన్నారని గుర్తు చేసిన బీఆర్ఎస్ నేత
- కోమటిరెడ్డి ఆన్‌రికార్డ్‌గానే అన్నట్లు వెల్లడి
మాణిక్కం ఠాగూర్‌కు రేవంత్ రెడ్డి రూ.50 కోట్లు లంచం ఇచ్చారని కోమటిరెడ్డి పేర్కొన్నారని ఇటీవల తన సిరిసిల్ల పర్యటనలో కేటీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో తన పరువుకు నష్టం కలిగేలా వ్యాఖ్యలు చేశారంటూ మాణిక్కం ఠాగూర్.. కేటీఆర్‌కు నోటీసులు పంపించారు. తాను కేటీఆర్‌పై పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. ఈ నోటీసులపై కేటీఆర్ పైవిధంగా స్పందించారు.