టీడీపీతో టచ్ లో ఉన్నాననే వార్తల్లో నిజం లేదు: బాలినేని శ్రీనివాస్ రెడ్డి
- బాలినేని వైసీపీని వీడుతున్నారంటూ ప్రచారం
- రాజకీయాల్లో ఉన్నంత వరకు జగన్ తోనే ఉంటానన్న బాలినేని
- విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని వ్యాఖ్య
వచ్చే ఎన్నికల్లో కూడా తాను వైసీపీ అభ్యర్థిగా ఒంగోలు నుంచే పోటీ చేస్తానని బాలినేని తెలిపారు. తాను విలువలతో కూడిన రాజకీయాలు చేస్తున్నానని చెప్పారు. విలువల కోసమే మంత్రి పదవిని కూడా వదులుకున్నానని, జగన్ వెంట నడిచానని అన్నారు. సామాజిక సమీకరణాలలో భాగంగానే ఎమ్మెల్యేల స్థానాలను మారుస్తున్నారని చెప్పారు. ప్రతి ఒక్కరూ జగన్ కు, పార్టీకి అండగా ఉండాలని అన్నారు.