ఓటు వేసేందుకు మైసూరు నుంచి హైదరాబాద్ బయల్దేరిన రామ్ చరణ్
- రేపు తెలంగాణలో ఎన్నికలు
- ఓటు హక్కు వినియోగించుకోనున్న రామ్ చరణ్
- ప్రస్తుతం గేమ్ చేంజర్ చిత్రంలో నటిస్తున్న గ్లోబల్ స్టార్
- మైసూరులో షూటింగ్
రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా కథ కూడా ప్రజాస్వామ్యం, ఎన్నికల చుట్టూనే తిరుగుతుంది. 'గేమ్ చేంజర్' తాజా షెడ్యూల్ చిత్రీకరణ మైసూరులో జరుగుతోంది.
దిల్ రాజు నిర్మాతగా తెరకెక్కుతున్న ఈ భారీ బడ్జెట్ చిత్రంలో రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ కథానాయిక. ఈ పాన్ ఇండియా చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నాడు.