తుది దశకు చేరుకున్న ఆదిత్య ఎల్-1 ప్రయాణం: ఇస్రో
- ఎల్-1 పాయింట్ కు చేరుకునేందుకు తుది ఏర్పాట్లు చేస్తున్నామన్న ఇస్రో ఛైర్మన్
- సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1 ప్రయోగం
- సూర్యుడిపై అధ్యయనం చేయనున్న ఆదిత్య
సెప్టెంబర్ 2న ఆదిత్య ఎల్1ను శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి ప్రయోగించారు. 125 రోజుల్లో 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించిన తర్వాత సూర్యునికి సమీపంలో ఉన్న ఎల్-1 పాయింట్ ను చేరుకునే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు. ఎల్-1 పాయింట్ నుంచి సూర్యుడి చిత్రాలను తీసి భూమికి పంపించనుంది. సూర్యుడిపై లోతుగా అధ్యయనం చేసేందుకు ఇవి ఇస్రోకు ఉపయోగపడనున్నాయి.