ప్రైవేట్ జెట్ లో మైసూరుకు రామ్ చరణ్.. వీడియో ఇదిగో!
- ఎయిర్ పోర్టులో రామ్ చరణ్ ఫొటోల వీడియో వైరల్
- నేటి నుంచి మైసూర్ లో గేమ్ చేంజర్ షూటింగ్
- కీలక సన్నివేశాల చిత్రీకరణకు శంకర్ ప్లానింగ్
బ్లాక్ కలర్ లో ఉన్న ప్రైవేట్ జెట్ లో నుంచి రామ్ చరణ్ రాయల్ గా దిగుతున్న వీడియోను చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. సింపుల్ అవుట్ ఫిట్‌లోనూ ఆయన లుక్ అదిరిపోయిందని అంటున్నారు. ఈ షెడ్యూల్ లో శంకర్ కీలక సన్నివేశాలను ప్లాన్ చేసినట్టుగా తెలుస్తోంది. వాస్తవానికి గేమ్ చేంజర్ నుంచి ఇప్పటికే ఓ పాట విడుదల కావాల్సింది. 'జరగండి.. జరగండి' అంటూ సాగే పాటను మొన్నటి దీపావళికే విడుదల చేస్తామని సినిమా యూనిట్ గతంలో ప్రకటించింది. అయితే, సాంకేతిక కారణాల వల్ల క్వాలిటీని దృష్టిలో పెట్టుకుని పాట రిలీజ్ ను వాయిదా వేశారు. ఈ ఒక్క పాట చిత్రీకరణ కోసమే డైరెక్టర్ శంకర్ కోట్లలో ఖర్చుపెట్టించినట్లు సినీ వర్గాల సమాచారం.