17 ఏళ్ల తర్వాత నెరవేరబోతున్న అనుష్క కల.. మెగాస్టార్ సరసన ఛాన్స్
- చిరంజీవితో నటించాలనేది అనుష్క చిరకాల స్వప్నం
- చిరు, దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్లో తాజా చిత్రం
- ఈ సినిమా కోసం అనుష్కను సంప్రదించిన చిత్ర యూనిట్
చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కాంబినేషన్ లో కొత్త చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమాకు అనుష్కను సంప్రదించారని టాలీవుడ్ టాక్. ఈ చిత్రంలో అనుష్క దాదాపు కన్ఫామ్ అయిందని చెపుతున్నారు. మరోవైపు, తనకు చిరంజీవితో నటించాలనేది ఒక కల అని పలు సందర్భాల్లో అనుష్క తెలిపింది. ఇన్నేళ్లకు ఆమె కల సాకారం కాబోతోంది.