మాదాపూర్ డ్రగ్స్ కేసు: ఏ29 నిందితుడైన నటుడు నవదీప్‌కు త్వరలో నోటీసులు?
- నవదీప్ పరారీలో ఉన్నట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు
- నవదీప్, మోడల్ శ్వేత సహా పరారీలో పదిహేడు మంది
- అరెస్ట్ చేసిన 8 మంది నిందితులను చంచల్‌గూడ జైలుకు తరలింపు
మరోవైపు ఈ డ్రగ్స్ కేసులో నటుడు నవదీప్ ఉన్నట్లుగా వార్తలు వచ్చాయి. ఈ మేరకు పోలీసు రిమాండ్ రిపోర్టులో పరారీలో ఉన్నట్లు తెలిపారు. నవదీప్‌తో పాటు మోడల్ శ్వేత సహా పదిహేడు మంది పరారీలో ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. నవదీప్‌ను ఏ29 నిందితుడిగా పేర్కొన్నారు. అతనికి ఈ రోజు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారు. డ్రగ్స్ కేసులో ఓ సినిమా ప్రొడ్యూసర్ కూడా ఉన్నాడని తెలుస్తోంది.