మరోసారి ఆదిత్య -ఎల్1 కక్ష్య పెంపు చేపట్టిన ఇస్రో
- బెంగళూరులోని ఇస్‌ట్రాక్ కేంద్రం నుంచి కక్ష్య పెంపు చేపట్టిన ఇస్రో
- కక్ష్య పెంపు సమయంలో ఆదిత్య-ఎల్1 గమనాన్ని నిశితంగా పరిశీలన
- ఆదిత్య-ఎల్1 ప్రస్తుతం 296 కి.మీ బై 71.767 కి.మీల దీర్ఘ వృత్తాకార కక్ష్యలో ఉందని వెల్లడి
- సెప్టెంబర్ 15 మరో మరోమారు కక్ష్య పెంపు ఉంటుదన్న ఇస్రో
ప్రస్తుతం ఆదిత్య ఎల్1 భూమి చుట్టూ 296 కి.మీ బై 71,767 కి.మీ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో పరిభ్రమిస్తోందని ఇస్రో వెల్లడించింది. సెప్టెంబర్ 15న రాత్రి 2.00 గంటల సమయంలో మరోమారు కక్ష్య పెంపు చేపడతామని ఇస్రో ‘ఎక్స్’ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.