నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఎన్‌ఐఏ నోటీసులు
- ఇటీవల కేరళలో భారీగా పట్టుబడ్డ డ్రగ్స్
- ఎన్ఐఏ అదుపులో కీలక నిందితుడు ఆదిలింగం
- గతంలో వరలక్ష్మి వద్ద పీఏగా పని చేసిన ఆదిలింగం
- అతడి వివరాల సేకరణ కోసం వరలక్ష్మికి ఎన్‌ఐఏ సమన్లు
కేరళలోని విళంజియం సమీపంలో ఇటీవల భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. ఈ కేసులో ఆదిలింగంను ఎన్‌ఐఏ అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తోంది. డ్రగ్స్ సరఫరాతో వచ్చిన డబ్బులను అతడు సినిమాల్లో పెట్టుబడి పెట్టినట్లు ఎన్‌ఐఏ గుర్తించింది. ఈ కేసులో వరలక్ష్మికి ఏమైనా సంబంధం ఉందా? గతంలో ఈమెకు ఆదిలింగం డ్రగ్స్ సరఫరా చేశాడా? అనే వివరాలను కూడా ఎన్‌ఐఏ రాబట్టే అవకాశం ఉందని తెలుస్తోంది.