కోమటిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవడానికి ఇదే సరైన సమయం: గుత్తా సుఖేందర్ రెడ్డి
- ఏ పదవీ వద్దంటున్న కోమటిరెడ్డి రాజకీయ సన్యాసం తీసుకోవాలన్న గుత్తా
- తనపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని మండిపాటు
- మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావడమే తమకు కావాలని వ్యాఖ్య
కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడు ఒకటంటే.. మరొక నేత ఇంకొకటి అంటారని... ఇలాంటి పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందని ఎద్దేవా చేశారు. వచ్చే ఎన్నికల్లో తనకు టికెట్ ఇచ్చినా, ఇవ్వకపోయినా తాను పట్టించుకోబోనని... ఎవరికి టికెట్ ఇచ్చినా తన సహకారం పూర్తిగా ఉంటుందని చెప్పారు. తమకు కావాల్సింది మళ్లీ కేసీఆర్ ప్రభుత్వం రావడమేనని అన్నారు.