గేమ్ ఛేంజర్‌లో శంకర్ మార్కు.. ఏకంగా ఏడు గెటప్స్‌లో రామ్ చరణ్!
- దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో నటిస్తున్న చరణ్
- దిల్ రాజు నిర్మాణంలో వస్తున్న సినిమా
- ఇటీవలే పూర్తయిన క్లైమాక్స్ చిత్రీకరణ
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఆసక్తికర వార్త ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో చరణ్ ఏడు గెటప్స్‌లో కనిపించబోతున్నాడట. సాధారణంగా శంకర్ సినిమాల్లో హీరోలు ఇలా రకరకాల లుక్స్‌లో కనిపించడం సహజమే. సన్నివేశాలతో పాటు పాటల్లో హీరోలను డిఫరెంట్ లుక్స్‌లో ప్రెజెంట్ చేయడం శంకర్ స్టయిల్. ఈ క్రమంలో ‘గేమ్ చేంజర్’లో చరణ్ ఏడు రకాల లుక్స్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. ఇప్పటికైతే ఐఏఎస్ ఆఫీసర్, రాజకీయ నాయకుడి పాత్రతో పాటు మిడిల్ ఏజ్ లుక్‌లో కనిపిస్తాడని తెలుస్తోంది. మరో నాలుగు గెటప్స్ కథలో భాగమా? లేక పాటల్లో వస్తాయా? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఈ సినిమా క్లైమాక్స్ సీన్స్ షూటింగ్ ఈ మధ్యే పూర్తయింది. తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ చిత్రంలో జయరామ్, అంజలి, సునీల్, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్నారు.