పాఠ్యాంశాల తయారీ కమిటీలో సుధా మూర్తి, శంకర్ మహదేవన్
- మూడు నుంచి పన్నెండో తరగతి వరకు సిలబస్ సమీక్ష
- కొత్త పాఠ్యాంశాల రూపకల్పన బాధ్యతలు
- ప్రకటించిన ఎన్ సీఈఆర్ టీ
జాతీయ విద్యా విధానం 2020లో భాగంగా కే కస్తూరిరంగన్ ఆధ్వర్యంలోని స్టీరింగ్ కమిటీ అభివృద్ధి చేసిన కరిక్యులమ్ కు అనుగుణంగానే కొత్త కమిటీ కూడా పని చేయనుంది. స్కూల్ సిలబస్ అభివృద్ధి, టీచింగ్, లెర్నింగ్ మెటీరియల్ (2-12 తరగతుల వరకు) రూపొందించే బాధ్యతలను కొత్త కమిటీ చూడనుంది. అలాగే ఒకటి, రెండో తరగతుల సిబలస్ సమీక్ష కూడా అవసరమేనని అభిప్రాయపడింది. ఎన్ఎస్ టీసీ అభివృద్ధి చేసి, ఖరారు చేసిన పాఠ్యాంశాలను ఎన్ సీఈ ఆర్ టీ ద్వారా పంపిణీ చేయనున్నారు.