ఏపీ ‘పది’ పరీక్షల్లో మార్పులు.. ఇకపై ఏడు పేపర్లు
- భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి ఒక పేపర్
- విడిగా జీవశాస్త్రం పేపర్
- రెండింటిలోనూ కలిపి 35 మార్కులు సాధిస్తేనే పాస్
- కాంపోజిట్ విధానం రద్దు
- ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్న తొలగింపు
మిగతా అయిదు సబ్జెక్టులకు మాత్రం ఒక్కో పేపర్ మాత్రమే ఉంటుంది. అలాగే, ప్రస్తుతం ఉన్న కాంపోజిట్ విధానాన్ని రద్దు చేశారు. 70/30 మార్కుల విధానంలో తెలుగు/సంస్కృతం, ఉర్దూ/హిందీ, ఉర్దూ/అరబిక్/, ఉర్దూ/పార్టీ పరీక్షలు నిర్వహిస్తుండగా ఇక నుంచి ఫస్ట్ లాంగ్వేజ్ ఒక్కటే వంద మార్కులకు ఉంటుంది. ప్రతిపదార్థం, భావం రాసే ప్రశ్న తొలగించి దాని స్థానంలో ఒక పద్యం ఇచ్చి, దానిపై నాలుగు ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో దానికి రెండు చొప్పున 8 మార్కులు ఉంటాయి.
రెండో ప్రశ్నగా గతంలో పద్యం, దాని భావానికి సంబంధించి 8 మార్కులు ఉండగా, ఇప్పుడు గద్యాన్ని చదివి నాలుగు ప్రశ్నలకు సమాధానం రాయాల్సి ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు 8 మార్కులు ఉంటాయి. విజయవాడలో నిన్న ఉపాధ్యాయ సంఘాలతో సమావేశమైన మంత్రి బొత్స సత్యనారాయణ ఈ వివరాలను వెల్లడించారు.