'బ్రో' సినిమా వివాదం.. అంబటి రాంబాబుపై పోటీ చేసేందుకు రెడీ అన్న 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీ
- 'బ్రో' సినిమాలో అంబటి రాంబాబు డ్యాన్స్ ను పోలిన డ్యాన్స్
- అచ్చం అంబటి డ్రెస్ వేసుకుని, అవే స్టెప్పులు వేసిన పృథ్వీ
- సత్తెనపల్లిలో అంబటిని చిత్తుగా ఓడిస్తానన్న పృథ్వీ
ఎవరినో కించపరుస్తూ సినిమాలో చూపించేంత నీచ స్వభావం పవన్ కల్యాణ్ ది కాదని పృథ్వీ అన్నారు. పవన్ వ్యక్తిత్వం చాలా గొప్పదని కొనియాడారు. సినిమాలోని డ్యాన్స్ ను వైసీపీ వాళ్లు మరోలా అర్థం చేసుకుంటే చేసేదేమీ లేదని అన్నారు. పవన్ ను వైసీపీ నేతలు దారుణంగా విమర్శించడాన్ని ఏమనాలని ప్రశ్నించారు. సత్తెనపల్లిలో అంబటి రాంబాబుపై పోటీ చేసేందుకు తాను సిద్ధమని పృథ్వీ సంచలన వ్యాఖ్యలు చేశారు. అంబటిని కచ్చితంగా చిత్తుగా ఓడిస్తానని ధీమా వ్యక్తం చేశారు. అంబటి వ్యాఖ్యలపై జనసేన శ్రేణులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్పారు.