మహేశ్ – రాజమౌళి సినిమాపై పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు
- ఆర్‌ఆర్‌ఆర్‌తో తెలుగు సినిమా ఖ్యాతిని హాలీవుడ్ స్థాయికి తీసుకెళ్లారని రాజమౌళిపై ప్రశంసలు
- మహేశ్ తో సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలన్న పవన్
- ఖుషీ అవుతున్న మహేశ్ బాబు ఫ్యాన్స్
అలాగే మహేశ్ బాబుతో ఆయన చేయబోయే సినిమానూ ప్రస్తావించారు. మహేశ్ – రాజమౌళి సినిమా ఇంకా పెద్ద స్థాయికి వెళ్లాలని కోరుకుంటున్నానని చెప్పారు. దీనిని కొత్తగా వచ్చేవాళ్ళు కొనసాగించాలన్నారు. తనకు అందరు హీరోలు ఇష్టమని, వారివల్ల ఎందరో కడుపు నిండుతుందని చెప్పుకొచ్చారు. మహేశ్ గురించి పవన్ ప్రస్తావించడంతో ఆయన ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మహేశ్ ప్రస్తుతం త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం చిత్రంలో నటిస్తున్నారు. ఆ చిత్రం ముగిసిన తర్వాత రాజమౌళి సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది.