ఓవర్సీస్ ప్రింట్స్ వెళ్లిపోయాయి ‘బ్రో’
- బ్రో చిత్రం గురించి తాజా అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్ సమద్రఖని
- ఈ నెల 28న విడుదల కానున్న పవన్–సాయితేజ్ సినిమా
- కథనం, మాటలు అందించిన త్రివిక్రమ్
చిత్ర బృందం ఇప్పటికే ప్రమోషన్స్ మొదలు పెట్టగా.. దర్శకుడు సముద్రఖని తాజాగా ఓ అప్‌డేట్ ఇచ్చారు. అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఓవర్సీస్ ప్రింట్లను వివిధ దేశాలకు పంపించినట్లు ట్వీట్ చేశారు. సంగీత దర్శకుడు తమన్‌తో కలిసి ల్యాబ్‌లో దిగిన ఫొటోను షేర్ చేశారు. పవన్ సినిమాలకు విదేశాల్లోనూ మంచి క్రేజ్ ఉంటుంది. ఓ రోజు ముందుగానే విడుదలయ్యే యూఎస్ మార్కెట్‌లో భారీ ఓపెనింగ్స్ వస్తుంటాయి.