గీ ముసురు సలిలో మంట లాంటి ముచ్చట.. మధ్యాహ్నం 2.30కి భగవంత్ కేసరి నుంచి భారీ అప్ డేట్
- అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న బాలయ్య
- హీరోయిన్లుగా కాజల్, శ్రీలీల
- విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు అర్జున్ రాంపాల్
ఇప్పుడు ఈ సినిమాకు సంబంధించి చిత్ర బృందం మరో కీలక అప్ డేట్ ఇవ్వనుంది. ‘గీ ముసురు సలిలో మంట లాంటి ముచ్చట’ అంటూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ రోజు 2 గంటల 30 నిమిషాలకు ఈ అప్ డేట్ వస్తోందంటూ పోస్టర్ పేర్కొంది. కొన్నిరోజులుగా వర్షం కారణంగా తెలుగు రాష్ట్రాలలో చల్లటి వాతావరణం నెలకొంది. మరి, ‘భగవంత్ కేసరి’ నుంచి ఈ మధ్యాహ్నం ఇచ్చు ముచ్చట ఏంటో అని అభిమానులు ఆత్రుతగా ఉన్నారు.