'ఉస్తాద్' నుంచి లిరికల్ సాంగ్ రిలీజ్!
- శ్రీ సింహా హీరోగా రూపొందిన 'ఉస్తాద్'
- ఆయన జోడీ కట్టిన కావ్య కల్యాణ్ రామ్
- సంగీతాన్ని అందించిన అకీవా
- ఆగస్టు 12వ తేదీన సినిమా విడుదల
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. "చుక్కల్లోంచి తొంగిచూసే చక్కానైనా జాబిల్లీ, పక్కాకొచ్చి కూర్చున్నాది అయ్ బాబోయ్ ఏం చేయాలి" అంటూ ఈ పాట సాగుతోంది. హీరో .. హీరోయిన్స్ పై ఈ పాటను చిత్రీకరించారు. హీరోతో కలిసి హీరోయిన్ ట్రావెల్ చేసే సందర్భంలో వచ్చే పాట ఇది.
అకీవా స్వరపరిచిన ఈ పాటకి రెహ్మాన్ సాహిత్యాన్ని అందించగా, కార్తీక్ ఆలపించాడు. సింహా ఇంతవరకూ మూడు నాలుగు సినిమాలు చేశాడు. అయితే అవి ఆశించిన స్థాయిలో ఆడలేదు. అందువలన ఈ సినిమా తప్పకుండా హిట్ కొట్టాలనే ఆశతో ఆయన ఉన్నాడు. ఇక కావ్య కల్యాణ్ రామ్ కూడా సరైన బ్రేక్ కోసమే వెయిట్ చేస్తోంది.