జేడీ చక్రవర్తి ఈజ్ బ్యాక్.. సస్పెన్స్ థ్రిల్లర్‌గా ‘దయా’ వెబ్ సిరీస్
- హాట్ స్టార్ లో ఆగస్టు 4న స్ట్రీమింగ్ కానున్న సిరీస్
- వ్యాన్ డ్రైవర్ పాత్రలో కనిపించనున్న జేడీ
- కీలక పాత్రల్లో ఈషా రెబ్బా, రమ్య నంబీశన్
వ్యాన్ డ్రైవర్ జీవితంలో అనుకోకుండా ఎదురయ్యే పరిస్థితుల నేపథ్యంలో సస్పెన్స్ థ్రిల్లర్‌గా ఈ వెబ్ సిరీస్ రూపొందించారు. చాన్నాళ్ల తర్వాత జేడీ చక్రవర్తి తన మార్కు నటనను చూపెట్టారు. జేడీ నడుపుతున్న వ్యాన్లో ఓ రోజు డెడ్ బాడీ కనిపిస్తుంది. అదే సమయంలో ఓ లెడీ జర్నలిస్ట్ మిస్ అవుతుంది. ఆ డెడ్ బాడీని మాయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్న సన్నివేశాలను ట్రైలర్‌లో చూపించారు. అసలు ఆ లేడీ రిపోర్టర్ ఎలా మిస్ అయింది? తన వ్యాన్ లో దొరికిన డెడ్ బాడీతో జేడీ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? వాటిని ఎలా పరిష్కరించుకున్నాడు? అనే సన్నివేశాలతో ట్రైలర్ మొత్తం సస్పెన్స్ గా ఉంది.