'గోలీ శంకర్'గా మెగా మేనల్లుడు!
- 'విరూపాక్ష'తో హిట్ కొట్టిన సాయితేజ్
- త్వరలో ప్రేక్షకుల ముందుకు రానున్న 'బ్రో'
- సంపత్ నందికి గ్రీన్ సిగ్నల్
- మాస్ యాక్షన్ ఎంటర్టయినర్ జోనర్లో సాగే కథ
'రచ్చ' .. 'బెంగాల్ టైగర్' సినిమాలు చూస్తే, మాస్ ఆడియన్స్ కి ఏం కావాలనేది సంపత్ నందికి బాగా తెలుసనే విషయం అర్థమవుతుంది. అయితే ఈ మధ్య కాలంలో ఆయనకి హిట్ పడలేదు. గోపీచంద్ హీరోగా వెంటవెంటనే రెండు సినిమాలు చేసినా, ఫలితంలో ఎలాంటి మార్పు రాలేదు. దాంతో ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే ఒక పట్టుదలతో ఆయన ఉన్నాడు.
ఆయన వినిపించిన కథ నచ్చడంతో సాయితేజ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుందని అంటున్నారు. ఈ సినిమాకి 'గోలీ శంకర్' అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. దాదాపు అదే టైటిల్ ను ఖాయం చేసే అవకాశాలు ఉన్నాయట. ఈ సినిమాలో మాస్ అంశాలు పుష్కలంగా ఉంటాయనే విషయం టైటిల్ ను బట్టే అర్థమవుతోంది.