ప్రభాస్ 'ప్రాజెక్టు కె'లో కమలహాసన్..? రూ.150 కోట్ల ఆఫర్ లో నిజమెంత?
- కమలహాసన్ ను సంప్రదించిన నిర్మాతలు
- రూ.150 కోట్ల ఆఫర్ లో నిజం లేదంటున్న చిత్ర వర్గాలు
- ఇంకా తన నిర్ణయాన్ని చెప్పని కమల్
- ఒకటి రెండు వారాల్లో స్పష్టతకు అవకాశం
కమలహాసన్ తో చర్చలు మొదలయ్యాయని, ఇంకా కమల్ తన నిర్ణయాన్ని ప్రకటించలేదని తెలుస్తోంది. కమల్ తన నిర్ణయం చెప్పేందుకు మరో ఒకటి రెండు వారాల సమయం పట్టొచ్చని ప్రాజెక్ట్ కె సినిమా వర్గాలు తెలిపాయి. ఈ సినిమా ఇప్పటికే 70 శాతం నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ సినిమాలో అమితాబ్, దీపికా పదుకొణె పాత్రలకు సంబంధించి మరో 10 రోజులు షూటింగ్ చేస్తే పూర్తవుతుందని సమాచారం.