‘రానానాయుడు’లోని శ్రుతి మించిన సన్నివేశాలపై ఎట్టకేలకు పెదవి విప్పిన వెంకటేశ్
- ‘రానానాయుడు’లో శ్రుతిమించిన శృంగార సన్నివేశాలు
- హద్దులు దాటిన డైలాగ్స్
- ఫస్ట్ సీజన్‌లో కొన్ని సన్నివేశాలు ప్రభావం చూపాయని ఒప్పుకున్న వెంకటేశ్
- రెండో సీజన్‌ను ఆకట్టుకునేలా తీస్తామని హామీ
రానానాయుడు వెబ్ సిరీస్‌కు నెట్‌ఫ్లిక్స్‌లో మంచి రెస్పాన్స్ వస్తోందన్న వెంకటేశ్.. జరిగిన దాని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం కంటే ముందుకు వెళ్లడమే మంచిదని అన్నారు. వచ్చే సీజన్‌ను మాత్రం అందరూ ఆకట్టుకునేలా తీస్తామన్నారు. ఫస్ట్ సీజన్‌లో కొన్ని సన్నివేశాలు, వాటిని తీసిన విధానం కొంత ప్రభావం చూపిన మాట వాస్తవమేనని అంగీకరించారు. మొదటి సీజన్‌తో పోలిస్తే రెండో సీజన్‌కు ప్రేక్షకులు కచ్చితంగా పెరుగతారని వెంకటేశ్ ఆశాభావం వ్యక్తం చేశారు.