ఆదిపురుష్ నుంచి ‘రాం సీతా రాం’ వీడియో సాంగ్ వచ్చేసింది
- సాహిత్యం అందించిన రామజోగయ్య శాస్త్రి
- జూన్16న విడుదల కానున్న చిత్రం
- ప్రమోషన్స్ లో జోరు పెంచిన చిత్ర బృందం
‘నువ్వు రాజకుమారివి జానకి.. నువ్వు ఉండాల్సింది రాజభవనంలో’ అని సీత పాత్రధారి కృతీ సనన్‌కు ప్రభాస్ చెబితే.. ‘నా రాఘవ ఎక్కడుంటే అదే నా రాజమందిరం.. మీ నీడైనా మిమ్మల్ని వదిలివెళ్తుందేమో.. ఈ జానకి వెళ్లదు’ అని ఆమె బదులిస్తుంది. ‘ఆదియు అంతము రాముడిలోనే.. మా అనుబంధం రాముడితోనే’ అంటూ మొదలైన పాటలో రామజోగయ్య శాస్త్రి అందించిన సాహిత్యం, మంచి విజువల్స్ ఆకట్టుకునేలా ఉన్నాయి.
వనవాసానికి వచ్చిన సమయంలో రాముడు, సీత ఒకరినొకరు అర్థం చేసుకున్న విధానం, సీతను రావణాసురుడు ఎత్తుకెళ్లిన తర్వాత ఇద్దరూ పడ్డ మథనాన్నిదర్శకుడు అద్భుతంగా చూపించే ప్రయత్నం చేశారు. ఈ చిత్రానికి ఓం రౌత్ దర్శకత్వం వహించారు. సైఫ్ అలీఖాన్ రావణాసురుడి పాత్ర పోషించారు.
.