వివాదాల కేరళ స్టోరీ.. వంద కోట్లకు వసూళ్ల జోరు!
- ఈ నెల 5న విడుదలైన చిత్రం
- బ్యాన్ చేసిన పలు రాష్ట్రాలు
- ఏడు రోజుల్లోనే రూ. 94 కోట్ల కలెక్షన్
ఈ నెల 5న ఈ చిత్రం విడుదలగా.. ఏడో రోజు రూ. 12.50 కోట్లు రాబట్టింది. ఇప్పటిదాకా మొత్తంగా రూ. 94 కోట్లు సొంతం చేసుకుంది. మరో రోజులో వంద కోట్ల మార్కును దాటనుంది. సుదీప్తో సేన్ దర్శకత్వం కేవలం రూ. 16 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లకు లాభాల పంట పడిస్తోంది.