అందుకే రీజినల్ కోఆర్డినేటర్ పదవి నుండి తప్పుకున్నా: జగన్‌తో బాలినేని
- ఉమ్మడి ప్రకాశం జిల్లాలో ప్రాధాన్యత లేదంటూ కొంతకాలంగా అసంతృప్తి
- ముఖ్యమంత్రి సముదాయించినా ఆ పదవికి నో
- ఎన్నికలు ఎంతో దూరంలో లేనందున నియోజకవర్గంపై దృష్టి సారించాలన్న బాలినేని
మంగళవారం జగన్ తో బాలినేని భేటీ అయ్యారు. ముఖ్యమంత్రి సముదాయించినా ఆయన మెత్తబడలేదని తెలుస్తోంది. రీజినల్ కోఆర్డినేటర్ పదవిలో కొనసాగేది లేదని చెప్పినట్టు సమాచారం. అయితే తాను నియోజకవర్గంపై దృష్టి సారించాల్సిన ఉన్నందున రాజీనామా చేసినట్లుగా ఆయన చెప్పినట్లుగా తెలుస్తోంది. ఆయన ఇటీవలి వరకు నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల వైసీపీ ప్రాంతీయ సమన్వయకర్తగా వ్యవహరించారు.