రజనీకాంత్‌పై వైసీపీ నీచపు వ్యాఖ్యలు.. జగన్ క్షమాపణలు చెప్పాల్సిందే: చంద్రబాబు
- రజనీకాంత్‌పై వైసీపీ మూకల అసభ్యకర దాడి దారుణమన్న టీడీపీ అధినేత
- వైసీపీ ప్రభుత్వాన్ని రజనీ ఒక్క మాట కూడా అనలేదన్న చంద్రబాబు
- జగన్ క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోవాలని సూచన
వైసీపీ ప్రభుత్వంపై ఆయన చిన్న విమర్శ కూడా చేయలేదని, ఎవరినీ చిన్న మాట కూడా అనలేదని అన్నారు. పలు అంశాలపై ఆయన తన అభిప్రాయాలను మాత్రమే పంచుకున్నారని అన్నారు. అహంకారంతో ఆయనపై చేస్తున్న విమర్శలను తెలుగు ప్రజలు సహించబోరన్నారు. శిఖరం లాంటి వ్యక్తిత్వం కలిగిన రజనీకాంత్‌పై వైసీపీ నేతల విమర్శలు ఆకాశంపై ఉమ్మి వేయడమేనని అన్నారు. జగన్ తన నేతలను అదుపులో పెట్టుకోవాలని సూచించారు. జరిగిన దానికి క్షమాపణ చెప్పి తప్పును సరిదిద్దుకోవాలని చంద్రబాబు సూచించారు.