మిస్సింగ్ కేసుల నేపథ్యంలో సాగే 'ఉగ్రం' .. ట్రైలర్ రిలీజ్!
- అల్లరి నరేశ్ తాజా చిత్రంగా రూపొందిన 'ఉగ్రం'
- పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా అల్లరి నరేశ్
- విజయ్ కనకమేడల నుంచి రెండో సినిమా
- మే 5వ తేదీన విడుదల కానున్న సినిమా
కొంతసేపటి క్రితం ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో పోలీస్ ఆఫీసర్ శివకుమార్ గా అల్లరి నరేశ్ కనిపిస్తున్నాడు. సిటీలో వరుసగా మిస్సింగ్ కేసులు నమోదవుతూ ఉంటాయి. ఈ రాకెట్ వెనుక ఎవరున్నారనేది కనిపెట్టడానికి శివకుమార్ రంగంలోకి దిగుతాడనే విషయం, ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది.
సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ గా .. పవర్ఫుల్ ఆఫీసర్ గా ఈ సినిమాలో అల్లరి నరేశ్ కనిపిస్తున్నాడు. ఆయన యాక్షన్ సీన్స్ ఒక రేంజ్ లో ఉన్నాయి. టైటిల్ కి తగిన బాడీ లాంగ్వేజ్ ను ఆయన ఈ సినిమాలో చూపిస్తూ వచ్చాడు. ఇంద్రజ కీలకమైన పాత్రను పోషించిన ఈ సినిమా, మే 5వ తేదీన విడుదల కానుంది.