'విరూపాక్ష' చిత్రంపై అద్భుతమైన రిపోర్టులు వస్తున్నాయి: చిరంజీవి
- సాయిధరమ్ తేజ్, సంయుక్త మీనన్ జంటగా విరూపాక్ష
- కార్తీక్ దర్శకత్వంలో చిత్రం
- నేడు థియేటర్లలో విడుదల
- మేనల్లుడి సినిమాపై చిరంజీవి పాజిటివ్ ట్వీట్
"అదిరిపోయే రీతిలో పునరాగమనం చేశావు సాయిధరమ్ తేజ్. అందుకు ఎంతో ఆనందంగా ఉంది. ప్రేక్షకులు నీ సినిమాను మెచ్చుకుంటున్నారు, దీవిస్తున్నారు. ఈ సందర్భంగా విరూపాక్ష చిత్ర బృందం అందరికీ హృదయపూర్వక అభినందనలు" అంటూ చిరంజీవి ట్వీట్ చేశారు. అంతేకాదు, తన అర్ధాంగి సురేఖ... సాయిధరమ్ తేజ్ కు విజయోత్సవ కేక్ తినిపిస్తున్న ఫొటోను కూడా చిరంజీవి పంచుకున్నారు.
సాయిధరమ తేజ్, సంయుక్త మీనన్ జంటగా కార్తీక్ దర్శకత్వంలో విరూపాక్ష చిత్రం తెరకెక్కింది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాత.