ఈ నెలలోనే ఓటీటీలో 'దసరా' స్ట్రీమింగ్
- నాని, కీర్తి సురేశ్ జంటగా నటించిన బ్లాక్ బస్టర్ మూవీ
- రూ.22 కోట్లకు డిజిటల్ రైట్స్ దక్కించుకున్న నెట్ ఫ్లిక్స్
- ఈ నెల 27 నుంచి ప్రసారం చేయనున్నట్లు సమాచారం
ఈ సినిమాను తొలుత మే 30న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రచారం జరిగింది. అయితే, తాజా సమాచారం ప్రకారం ఈ నెల 27 నుంచే ఓటీటీలో ప్రసారం చేయనున్నట్లు తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లో దీనిపై నెట్ ఫ్లిక్స్ అధికారికంగా ప్రకటన చేయనుంది. ఈ సినిమాను ఎస్ఎల్వీ సినిమాస్ నిర్మించగా సంతోష్ నారాయణన్ సంగీతం అందించారు. ఇందులోని చమ్కీల అంగిలేసి సాంగ్ చార్ట్ బస్టర్ గా నిలిచిన సంగతి తెలిసిందే!