నిజంగానే నేను ఆ హీరోయిన్ ను గాఢంగా ప్రేమించాను: సాయితేజ్
- ఆదర్శంగా తీసుకోవలసిన హీరోయిన్ సమంత
- రెజీనా అంటే ఇష్టమన్న సాయితేజ్
- 'తిక్క' సినిమా హీరోయిన్ ను లవ్ చేశానని వెల్లడి
- ఆల్రెడీ ఆమెకి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని తెలిసి బాధపడ్డానని వ్యాఖ్య
"నేను లవ్ చేసింది మాత్రం 'తిక్క' సినిమాలో నాతో పాటు చేసిన 'లారిస్సా బొనేసి'. ఆమెను నేను చాలా గాఢంగా ప్రేమించాను. ఆ సినిమాకి సంబంధించి సాంగ్ షూటింగు జరుగుతూ ఉండగా, నా మనసులోని మాటను చెప్పాను. 'నువ్వంటే నాకు చాలా ఇష్టం ..' అంటూ ఆమెకి విషయం చెప్పేశాను. 'సారీ తేజూ ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు' అని ఆమె చెప్పేసింది. అప్పుడు మాత్రం నా హార్ట్ బ్రేక్ అయింది" అని చెప్పాడు.
"నేను డిగ్రీ చదువుతున్న రోజుల్లోనే ఒక అమ్మాయిని ప్రేమించాను. కాకపోతే డిగ్రీ పూర్తయిన తరువాత నేనే దగ్గరుండి ఆ అమ్మాయికి పెళ్లి చేసి పంపించాను. ఈ విషయం మా అమ్మకి మాత్రమే కాదు .. మా కల్యాణ్ మామయ్యకి కూడా తెలుసు. ఇప్పుడు మాత్రం సోలో బ్రతుకే సో బెటర్ అన్నట్టుగా నా పని నేను చేసుకుంటున్నాను" అని చెప్పుకొచ్చాడు.