దేశం కాని దేశంలో వారం పాటు వెంటిలేటర్ పై ఉన్నా.. బతుకుతానో లేదో అనుకున్నా: సురేందర్ రెడ్డి
- అఖిల్ హీరోగా సురేందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఏజెంట్
- ఈ నెల 28న విడుదల కాబోతున్న చిత్రం
- సినిమా ఆలస్యం కావడానికి కారణం వెల్లడించిన దర్శకుడు
సినిమా షూటింగ్ కోసం తాను బుడాపెస్ట్ వెళ్లగానే తాను కరోనా బారిన పడ్డానని తెలిపారు. తీవ్రంగా ప్రభావితమై వారం రోజులపాటు వెంటిలేటర్ మీద ఉన్నానని, బతుకుతానో లేదోనన్న పరిస్థితి ఎదుర్కొన్నానని తెలిపారు. తమ సినిమా యూనిట్ వాళ్లంతా తిరిగి స్వదేశానికి వచ్చేయగా.. తన కుటుంబ సభ్యులు హోటల్ లో ఉండిపోయారని చెప్పారు. అటువంటి పరిస్థితిలో తాను ఆసుపత్రిలో చేరగా.. తన పక్కన రోజుకి ముగ్గురు, నలుగురు చనిపోతూ ఉండేవారని తెలిపారు. ‘అప్పుడు నా పరిస్థితి ఎలా ఉంటుందో ఆలోచించండి. ఒక వారం హాస్పిటల్ లో ఉన్నాక, మళ్ళీ హోటల్ లో అదే చికిత్స కొనసాగించా. నాకు, నా కుటుంబానికి ఎదురైన ఇలాంటి పరిస్థితి ఎవరికీ రాకూడదు. నేను కోలుకోవడానికి సరిగ్గా ఆరు నెలలు పట్టింది. ఇండియా వచ్చి ఇక్కడ మళ్ళీ మెడికేషన్ మొదలు పెట్టిన తరువాత మెల్లగా కోలుకున్నాను. అందుకని ఈ సినిమా ఆలస్యం అయింది’ అని చెప్పుకొచ్చారు.
అయినా తనపై నమ్మకంతో ఎంతో ఓపిగ్గా ఎదురుచూసిన అఖిల్ ని ప్రశంసించాలన్నారు. హైదరాబాద్ లో షూటింగ్ చేస్తున్న సమయంలో హీరో అఖిల్ ను కాపాడబోయి సురేందర్ రెడ్డి కాలికి గాయమైంది. దాని వల్ల కూడా సినిమా మరికొంత ఆలస్యం అయింది. సినిమాకు రెండేళ్లు పట్టినా 102 రోజులు మాత్రమే షూటింగ్ చేశామని సురేందర్ రెడ్డి చెప్పారు.