అప్పుడు అంతగా టెన్షన్ పెట్టిన తేజు ఇప్పుడు చింపేశాడు: అల్లు అరవింద్
- అల్లు అరవింద్ చేతుల మీదుగా 'విరూపాక్ష' ట్రైలర్ రిలీజ్
- సాయితేజ్ మరో మలుపు తీసుకున్నాడన్న అరవింద్
- తను చింపేశాడని అంటూ ఉంటే సంతోషంగా ఉందని వెల్లడి
- తప్పకుండా హిట్ అవుతుందని ధీమా
"తేజు పుట్టిన దగ్గర నుంచి చూస్తూ వచ్చినవాడిని. తనకి ఆ రోజున ఆ ప్రమాదం జరిగినప్పుడు ముందుగా అక్కడికి చేరుకున్నది నేనే. అతనికి కొన్ని టెస్టులు చేసి బ్రతుకుతాడు .. బయటపడతాడు .. షాక్ లో ఉన్నాడు అనే విషయాన్ని డాక్టర్లు చెప్పడానికి ఒక 15 నిమిషాలు పట్టింది. ఈ 15 నిమిషాల్లో మేము పడిన టెన్షన్ ఆ భగవంతుడికే తెలియాలి" అని చెప్పారు.
"ఆ రోజున అంతగా టెన్షన్ పెట్టిన తను, మళ్లీ అక్కడి నుంచి ఒక మలుపు తీసుకుని, ఈ రోజున ఈ సినిమాను చింపేశాడని అంతా అంటూ ఉంటే ఆనందంగా ఉంది. ఈ సినిమాకి పిచ్చి ఓపెనింగ్స్ వస్తాయనే విషయం ట్రైలర్ చూస్తేనే తెలిసిపోతోంది. 'కాంతార' సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేసిన అజనీశ్ ఈ సినిమాకి సంగీతాన్ని అందించడం విశేషం. ఈ సినిమా తప్పకుండా సూపర్ హిట్ అవుతుంది" అని చెప్పుకొచ్చారు.