'రావణాసుర' నుంచి థీమ్ వీడియో సాంగ్ రిలీజ్
- 'రావణాసుర'గా కనిపించనున్న రవితేజ
- కథానాయికలుగా ఐదుగురు హీరోయిన్స్ సందడి
- సంగీతాన్ని సమకూర్చిన హర్షవర్ధన్ రామేశ్వర్
- ఈ నెల 7వ తేదీన సినిమా విడుదల
తాజాగా ఈ సినిమా నుంచి ఒక లిరికల్ థీమ్ సాంగ్ ను రిలీజ్ చేశారు. రావణా .. రావణా .. రావణా .. దశగ్రీవ .. రావణా' అంటూ ఈ పాట సాగుతోంది. హర్షవర్ధన్ రామేశ్వర్ సంగీతాన్ని సమకూర్చిన ఈ సినిమాలోని ఈ పాటకి శ్రీహర్ష సాహిత్యాన్ని అందించగా అరుణ్ కౌండిన్య ఆలపించారు.
ఈ సినిమాలోని ఐదుగురు హీరోయిన్స్ లో ప్రధానమైన నాయిక ఎవరు? హీరో పాత్రకే నెగెటివ్ షేడ్స్ ఉంటే .. అసలు విలన్ ఎవరు? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ సందేహాలకు ఈ సినిమా మాత్రమే సమాధానం చెబుతుందనేది మేకర్స్ మాట. ఈ నెల 7వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.