'దొరసాని' తరువాత అసలు విషయం అర్థమైంది: శివాత్మిక
- 'దొరసాని'తో పరిచయమైన శివాత్మిక
- అప్పుడు కెరియర్ కలర్ఫుల్ గా కనిపించిందని వ్యాఖ్య
- ఆ తరువాత గ్యాప్ వచ్చిందని వెల్లడి
- ఇక్కడ నిలదొక్కుకోవడం ఈజీ కాదని అర్థమైందన్న శివాత్మిక
ఈ నేపథ్యంలో తాజా ఇంటర్వ్యూలో శివాత్మిక మాట్లాడుతూ .. 'రంగమార్తాండ'లో చేసే ఛాన్స్ రావడం నేను చేసుకున్న అదృష్టం. ఒక వైపున కృష్ణవంశీ గారు .. మరో వైపున సీనియర్ స్టార్స్ కావడంతో కొంత భయపడ్డాను. కానీ వాళ్లందరి సపోర్టుతో బాగా చేయగలిగాను. ఈ సినిమా చూసిన చాలామంది నన్ను గుర్తుపెట్టుకుని మెచ్చుకుంటూ ఉండటం విశేషం" అంటూ హర్షాన్ని వ్యక్తం చేసింది.
'దొరసాని' సినిమా సమయంలో నేను చాలానే ఊహించుకున్నాను. ఈ సినిమా చేసిన తరువాత ఇక వరుసగా ఒక్కో సినిమా చేసుకుంటూ వెళ్లిపోవడమే అనుకున్నాను. కానీ ఆ తరువాత గ్యాప్ రావడంతో, నేను అనుకున్నంత ఈజీ కాదు అనే విషయం అప్పుడు అర్థమైంది. ఇక్కడ మన పని మనం చేసుకుంటూ పోవడమే మన చేతుల్లో ఉందనే సంగతి స్పష్టమైంది" అంటూ చెప్పుకొచ్చింది.