అప్పట్లో లక్ష్మీ పార్వతి, ఇప్పుడు సజ్జల.. జగన్ జాగ్రత్తగా ఉండాలి: రఘురామరాజు
- లక్ష్మీపార్వతి ప్రమేయం ఎక్కువ కావడం వల్లే టీడీపీలో సంక్షోభం తలెత్తిందన్న రఘురామ రాజు
- జగన్ మేలుకోకుంటే సంక్షోభం తప్పదన్న ఎంపీ
- పార్టీ కోసం త్యాగాలు చేసిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డి సస్పెన్షన్ సిగ్గు చేటన్న నరసాపురం ఎంపీ
ఎమ్మెల్యేలను ఒకప్పటి సాక్షి ఉద్యోగి అయిన సజ్జలకు రిపోర్టు చేయాలనడం సరికాదని రఘురామరాజు అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఓటు వేయలేదని ఏ ప్రాతిపదికన చెబుతున్నారన్న ఆనం ప్రశ్న సబబుగానే ఉందన్నారు. వైసీపీ కోసం ఎన్నో త్యాగాలు చేసిన మేకపాటి చంద్రశేఖర్‌రెడ్డిని సస్పెండ్ చేయడం సిగ్గుచేటని రఘురామరాజు పేర్కొన్నారు.