'పొన్నియిన్ సెల్వన్ 2' నుంచి సాంగ్ రిలీజ్!
- సంచలన విజయాన్ని సాధించిన 'పీఎస్ 1'
- రిలీజ్ కి రెడీ అవుతున్న 'పీఎస్ 2'
- అంచనాలు పెంచుతున్న సెకండ్ పార్టు
- ఏప్రిల్ 28వ తేదీన విడుదలవుతున్న సినిమా
అలాంటి ఆ సినిమాకి సీక్వెల్ గా ఇప్పుడు సెకండ్ పార్టు రావడానికి రెడీ అవుతోంది. లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించిన ఈ సినిమా నుంచి, తాజాగా ఒక లిరికల్ సాంగును రిలీజ్ చేశారు. 'ఆగనందే ఆగనందే మోవి నవ్వుతోందే' అంటూ ఈ పాట మొదలవుతోంది. వాల్ పెయింటింగ్స్ తరహాలో ఈ పాటను ఆవిష్కరించారు. కార్తీ - త్రిష పై ఈ పాటను చిత్రీకరించారు.
ఎక్కడి నుంచి అయితే అసలు కథ మొదలవుతుందో అక్కడే ఫస్టు పార్టును ఆపేశారు. అసలు కథ అంతా కూడా సెకండ్ పార్టులోనే ఉండనుంది. అందువలన అందరూ కూడా ఈ సినిమా కోసం వేయికళ్లతో వెయిట్ చేస్తున్నారు. ఏప్రిల్ 28వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా వివిధ భాషల్లో థియేటర్లకు రానుంది.