దసరా సెన్సార్ పూర్తి.. నిడివి ఎంతంటే..!
- హీరోగా నాని, హీరోయిన్ గా కీర్తి సురేశ్
- శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో వస్తున్న సినిమాపై భారీ అంచనాలు
- ఈ నెల 30న విడుదల కానున్న చిత్రం
ఈ చిత్రానికి సంబంధించిన కొత్త అప్ డేట్ వచ్చింది. ఈ సినిమా సెన్సార్ పూర్తయింది. సెన్సార్ బృందం దసరాకు యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. రెండు గంటల ఇరవైతొమ్మిది నిమిషాల నిడివితో ఇది ప్రేక్షకుల ముందుకు రానుంది. సింగరేణి బొగ్గు గనుల బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని చూసిన సెన్సార్ సభ్యులు హర్షం వ్యక్తం చేశారని తెలుస్తోంది. ఈ సినిమాను శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించారు. సంతోష్ నారాయణ సంగీతం అందించారు. దీక్షిత్ శెట్టి, సముద్రఖని, సాయి కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.